Congress complaint: తెలంగాణలో ఎన్నికల సమాయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధుపై నిఘా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 2018లో పోలింగ్ రోజు రైతు బంధు పంచారని ఈసారి కూడా అలాగే పంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా ఈ సారి రైతు బంధు నవంబర్ 3వ తేదీకి ముందు కానీ 30 వ తేదీ తరవాత కానీ రైతు బంధు సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమీషన్‌ని కోరారు.
కరెంటు కూడా ఆపేయమంటారేమో..(Congress complaint)
కాంగ్రెస్ లేఖపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచినీళ్లు, ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో.. అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని ఎద్దేవా చేశారు. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయిందని విమర్శించారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరని మండిపడ్డారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా అని అన్నారు.