Site icon Prime9

CM Revanth Reddy: శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

 CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు విఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు చెప్పారు. తెలంగాణలో మంచి వర్షాలు కురువాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే భక్తుల కోసం సత్రం, కళ్యాణమండపం నిర్మాణానికి కృషిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకోవడమే తమ లక్ష్యమన్నారు.

 

తిరుపతిలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు హామీ | Revanth Reddy | Prime9 News

Exit mobile version
Skip to toolbar