Site icon Prime9

CM Revanth Reddy: కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ప్రజలు ఇచ్చిన తీర్పును నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. అందెశ్రీ కవితతో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ప్రజలు ఛీ కొట్టినా మార్పులేదు..(CM Revanth Reddy)

ఆదర్శవంతమైన పాలనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.కుటంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు.ప్రజలు ఇచ్చిన తీర్పును నేతలు గుర్తుంచుకోవాలి .ప్రజల తీర్పును అంగీకరించే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు.నిరంకుశత్వం ఎక్కువ కాలం చెల్లదు.ప్రజలు ఛీ కొట్టినా బీఆర్ఎస్ సభ్యుల్లో మార్పు రాలేదు.ప్రగతిభవన్ గడీలను బద్దలుకొట్టాం.హోంమంత్రినే ప్రగతిభవన్‌లోకి రానీయలేదు.గద్దర్‌ను సైతం ప్రగతిభవన్‌లోకి అనుమతించలేదు.ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ప్రవేశం లేదు.ఈనాడు సామాన్యుడు కూడా సీఎంను కలవవచ్చు.అమరుల కుటుంబాలను ఏ ఒక్కరోజైనా ప్రగతిభవన్‌కు ఆహ్వానించారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కేటీఆర్ కు జెలసీ..

తెలంగాణ ఉద్యమం సందర్బంగా త్యాగాలు చేసిన కుటుంబాలకు పదవులు లేవని కాని కేసీఆర్ ఇంట్లో అందరికీ పదవులు ఇచ్చుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.ఉద్యమంలో డీఎస్పీ పదవి వదులుకున్న నళినికి ఏం న్యాయం చేశారు?ఉద్యమపార్టీ అని చెప్పుకునేటోళ్లు .. ధర్నాచౌక్‌లను ఎత్తేశారు.రైతు ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.ఈ లెక్కలను కేంద్రమే రాజ్యసభలో ప్రకటించింది.పదేళ్లలో 8 వేల మందికి పైగా రైతులు చనిపోయారు. .మేనేజ్‌మెంట్ కోటాలో కేటీఆర్ సీఎం అవుదామనుకున్నారు.ప్రజల నుంచి వచ్చిన నేను సీఎం అయ్యానని కేటీఆర్‌కు అసూయ.గత ప్రభుత్వ హయాంలో అన్నీ అవకతవకలే.పదో తరగతి పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేదు.టీఎస్‌పీఎస్సీ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Exit mobile version