Site icon Prime9

CM Jagan Comments: మహానేతకు వారసులు ఎవరో మీరే చెప్పాలి.. సీఎం జగన్

cm jagan

cm jagan

CM Jagan Comments: పులివెందుల గడ్డ సాక్షిగా సీఎం జగన్ తన చెల్లెలు షర్మిలపై సెటైర్లు వేసారు. పులివెందుల అసెంబ్లీ స్దానం నుంచి నామినేషన్ వేయడానికి గురువారం వచ్చిన సీఎం జగన్ ఈ సందర్బంగా బహిరంగసభలో తన ప్రత్యర్దులపై మండిపడ్డారు.

పసుపు చీరలు కట్టుకుని..(CM Jagan Comments)

పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వాళ్లా వైఎస్సార్‌ వారసులు? వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ ఎవరు చేసారు ? అయన పై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు? వైఎస్సార్‌సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? వైఎస్సార్‌ వారసులా?. అంటూ జగన్ ప్రశ్నించారు. పులివెందుల కల్చర్‌, కడప కల్చర్‌, రాయలసీమ కల్చర్‌ అంటూ మనపై కొంత మంది వేలెత్తి చూపిస్తున్నారు .కానీ మంచి చేయడం, బెదిరింపులకు లొంగకపోవడం, మంచి మనసు కలిగి ఉండడం , మాట తప్పకపోవడం మన కల్చర్‌ అని జగన్ అన్నారు .చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలో భాగం అయ్యారు. ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది మీరే అంటూ జగన్ ప్రజలను కోరారు .

Exit mobile version