Site icon Prime9

Chandrababu is a power freak: చంద్రబాబు అధికార భగ్నప్రేమికుడు .. సీఎం జగన్

JAGAN

JAGAN

Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార భగ్నప్రేమికుడని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు జీవితంలో ఎప్పుడూ చేయలేని, చేయని పనులు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. బాబు పాలనలో కుప్పం ప్రజలకు కూడ మంచి చేయలేదన్నారు. ఆయన, ఆయన దత్త పుత్రుడు కలిసి ఈ మధ్య నోటికి పని చెబుతున్నారు.టీడీపీని తెలుగు బూతు పార్టీగా మార్చేశారుజనసేనను రౌడీసేనగా మార్చారు.దత్త పుత్రుడుని, సొంత పుత్రుడిని ప్రజలు ఓడించారు.చివరికి కుప్పంలో కూడా అన్ని ఎన్నికల్లోను టీడీపీ నీ చిత్తుగా ఓడించి… బాయ్ బాయ్ చెప్పారు. వాళ్లకు ఓటు ఎందుకు వేయాలో బాబు, దత్త పుత్రుడు చెప్పరు.దోచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతో బాబు ఒక వర్గం మీడియా ప్రవర్తన ఉందని జగన్ ఆరోపించారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇదేం ఖర్మరా బాబు అనిపిస్తుంది.ఒకటే చెప్తున్నా… ఈనాడు, జ్యోతి, టీవీ 5నీ, పవన్ కళ్యాణ్ నీ, బాబుని నమ్మకండి.మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి అండగా నిలవండి.ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇదేం ఖర్మరా బాబు అనిపిస్తుందని జగన్ అన్నారు.

రసాపురంలో రూ. 3,300 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్ చెప్పారు. నరసాపురం చరిత్రలో ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు జరగడం ఇదే తొలిసారి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని తెలిపారు. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. ఫిషరీస్ యూనివర్సిటీతో నరసాపురం రూపురేఖలు మారతాయని తెలిపారు. ఏపీలో 9 ఫిషింగ్ హార్బర్లు రానున్నాయని వీటికోసం రూ. 3,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.1400కోట్లతో మంచినీటి గ్రీడ్ పథకానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. పాలకొల్లులో రూ.500కోట్లతో వైద్య కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్బంగా పైప్ లైన్ తో జీవనోపాధి కోల్పోయిన 23వేల మంది మత్స్యకారులకు 107కోట్ల రూపాయాల నగదును సీఎం జగన్ బటన్ నొక్కి నిధులు మంజూరు చేసారు.

Exit mobile version
Skip to toolbar