Chandrababu- Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం..(Chandrababu- Pawan Kalyan)
ఈనెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ సారి కేంద్రంలో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ రాలేదు. దీనితో భాగస్వామ్య పార్టీలపైన ఆధారపడవలసిన పరిస్దితి నెలకొంది. దీనితో ఎన్డీఏ కూటమిలో నితీష్ ,చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ,ఎకనాథ్ షిండే లు కీలకం కానున్నారు .