Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వివిధ నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి తెలుగుదేశంలో చేరారు. ద్వారకానాథ రెడ్డి బంధువులు విజయసాయి రెడ్డి, సునందరెడ్డి మినహా ఇతర కుటుంబ సభ్యులు తెలుగుదేశంలో చేరారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు టీడీపీలో చేరారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరముందని అన్నారు. ఇంత దారుణమైన సీఎంని, పాలనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇసుక, మద్యం దందాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని.. ప్రజా వ్యతిరేకత రాగానే ఎమ్మెల్యేలను మారుస్తున్నారని విమర్శించారు. 5కోట్ల మంది ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జగన్ రాజకీయాల్లో లేకపోతే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగేది కాదని చంద్రబాబు అన్నారు.దాడి వీరభద్రరావు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర రాజకీయాలను శాసించిన నాయకుడు, పారదర్శక పాలనకు, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన చంద్రబాబు గారిని అక్రమంగా నిర్బంధించి, హింసించిన ఫలితాన్ని రేపటి ఎన్నికల్లో జగన్ అనుభవించబోతున్నాడు. టీడీపీకి 150 సీట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసారు.