Site icon Prime9

Medical Colleges : దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని అంటే ?

central government issues news medical colleges in ap and telangana

central government issues news medical colleges in ap and telangana

Medical Colleges : దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా ఇందులో 17 కాలేజీలు ఏపీ, తెలంగాణకు కేటాయించడం గమనార్హం. కాగా ఇందులో తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్ కి ఐదు మెడికల్ కాలేజీలు కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ ఐదు వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటుకు ఆమోదం లభించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో ప్రారంభం కానున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇక అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్‌, వరంగల్‌, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, అసిఫాబాద్‌, నిర్మల్‌, సిరిసిల్ల, వికారాబాద్‌, హైదరాబాద్‌, జనగాంలలో నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

అయితే మేడ్చల్‌- మల్కాజ్‌గిరిలో అరుందతి ట్రస్ట్‌, మేడ్చల్‌లో సీఎంఆర్‌ ట్రస్ట్‌, వరంగల్‌లో ఫాదర్‌ కొలంబో ట్రస్ట్‌, హైదరాబాద్‌లో నీలిమా ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానుండగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోని కాలేజీలు ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది.

 

Exit mobile version