Site icon Prime9

CBI Notices: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

kavitha

kavitha

CBI Notice to MLC Kavitha: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాంలో 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన 11 గంటలకు వివరణ ఇచ్చేందుకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని అరోరా అంగీకరించారని తెలిపారు. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకుంటున్నారని ఈ నేపధ్యంలో కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.

సీబీఐ నోటీసుపై కల్వకుంట్ల కవిత దీనిమీద స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో నా పేరు ఉండడం మీద వివరణ కోరుతూ సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద నాకు సీబీఐ నోటీసు జారీ చేయబడింది. అందులో వారు పేర్కొన్న ప్రకారం… వారి అభ్యర్థన మేరకు డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశాను అని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‎కు ఎ వెళ్లారు. సీఎం కేసీఆర్‎తో భేటీ కానున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ, సీబీఐ కేసులు, భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు.

Exit mobile version