Chikoti Praveen : తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీలోకి చేరేందుకు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ సిద్ధమయ్యాడు. ఈ నెల 12వ తేదీన చికోటి ప్రవీణ్ బీజేపీ కండువా కన్నుకోనున్నాడు. . రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరనున్నారు.
ఎమ్మెల్యేగా పోటీ చేయాలని..(Chikoti Praveen)
మరో మూడు నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలని ప్రవీణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికోసం బీజేపీ అయితే బాగుంటుందని పోటీ చేసే నియోజక వర్గాన్ని కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై గత నెలలోనే బీజేపీ లోని పెద్ద నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. వారు కూడా సానుకూలంగా స్పందించడంతో బీజేపీలో అధికారికంగా చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ప్రవీణ్ మే నెలలో థాయ్‌లాండ్‌లోని పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ పట్టుబడ్డాడు.నేపాల్, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాల్లో జూదం ఆడుతున్నాడని పలు కేసులు నమోదు చేశారు. ప్రవీణ్ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేపట్టింది.హవాలా డబ్బు లావాదేవీల్లో ప్రమేయం ఉందన్న అనుమానంతో జూలై 29న అతని నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించడంతో ప్రవీణ్ పేరు వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలోనే ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు సోదరుల పేర్లు బయట కొచ్చాయి. తలసాని సోదరులు మహేష్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్‌ను పిలిచి ఈడీ అధికారులు ప్రశ్నించారు.