Site icon Prime9

Hyderabad: హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Ankura Hospital

Ankura Hospital

Hyderabad: హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆస్పత్రిలో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని మంటలు అదుపు చేయడంతో పెనుముప్పు తప్పింది. ఆసుపత్రిలో ఎక్కువగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు అదుపులోకి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

 షార్ట్ సర్క్యూటే కారణం ..(Hyderabad)

మొదట ఆరో అంతస్తులో వ్యాపించిన మంటలు క్రమేపీ భవనం మొత్తానికి వ్యాపించాయి. ప్రమాదంతో అప్రమత్తమయిన సిబ్బంది రోగులను తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లు సంఘటనా స్దలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తుండగా వీరికి స్దానికులు కూడా సహకరించారు. షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.ఆసుపత్రిలో పనిచేసే నర్సులు ఆరో అంతస్తులో హాస్టల్ నిర్వహిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భయాందోళనలకు గురయి 100 మంది కిందకి వచ్చేసారు. అయితే ఈ హడావుడిలో తమ సర్టిఫికెట్లు అక్కడే వదిలి వచ్చేసామని వారు రోదిస్తున్నారు. మొత్తంమీద ఎవరికీ ప్రాణహాని కలగలేదని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో ఎంతమంది రోగులు ఉన్నారో తెలియవలసి ఉంది.

 

 

Exit mobile version