Bharath Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో నవంబర్ 1న జరగనుంది. రాహుల్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటన ముగించుకుని రాజేంద్రనగర్ మీదుగా నగరంలోకి ప్రవేశిస్తారు.నగరంలో ఆరాంఘర్, చార్మినార్, మోజాంజాహి మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి దర్గా, విజయనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట, పెద్ద శంకరం పేట, మద్కూర్ మీదుగా జోడోయాత్ర కొనసాగనుంది.
భారత్ జోడో యాత్రకు టీపీసీసీ విసృత ఏర్పాట్లు చేయనుంది. పలు బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో కాంగ్రెస్ బలాన్ని నిరూపించుకునే విదంగా పాదయాత్రలో అనుసరించాల్సిన విధి విదానాలతోపాటు రూట్ మ్యాప్ పై పీసీసీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలు సారథ్యం వహించనున్న ఈ 10 కమిటీలతో పాదయాత్ర పొడవునా యాత్రను సమన్వయం చేసుకుంటూ రాహుల్ గాంధితో కలిసి ముందుకు సాగనున్నారు. మునుగోడు ఉపఎన్నికతో పాటు రాహుల్ యాత్రను సమన్వయం చేసుకునేలా తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.