Site icon Prime9

Bandla Ganesh: సీఎం రేవంత్ రెడ్డిని చూసి కేటీఆర్,హరీష్ రావు భయపడుతున్నారు.. బండ్ల గణేష్

Bandla Ganesh

Bandla Ganesh

 Bandla Ganesh :సీఎం రేవంత్ రెడ్డిని చూసి కేటీఆర్, హరీష్ రావులు భయపడుతున్నారని కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అన్నారు. గొప్ప మనసు ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఆయన్ను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు.

హరీష్ రావు మాటల్లో అసూయ..( Bandla Ganesh)

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్లోకి వెళ్లే చాన్స్ ఎవరికైనా ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల.. సమస్య ఉన్న ప్రతి ఒక్కరు సీఎంను కలిసే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు. 100 రోజుల తరువాత కాంగ్రెస్ పప్పులు ఉడకవు అని హరీష్ రావు అన్నారు. పప్పు కాదు బిర్యానీయే ఉడికిస్తామని గణేష్ అన్నారు. మీకు ఎంపీ సీట్లు ఎందుకు ఇస్తారు? ఒక్క సీటు కూడా రాదు మీకు. రేవంత్ రెడ్డి 30 రోజుల్లో అద్బుతంగా పాలించారు. మంత్రులంతా ప్రజలకోసం కష్టపడుతున్నారు. సమర్దవంతులైన అధికారులను నియమించారు. ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి చర్చించారు. యువకుడు, కష్టపడే సీఎం రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ ను దళిత ఉప ముఖ్యమంత్రి నివాసంగా చేసారు. మిగిలిన భవనాలను మంత్రులకు కేటాయించారు. మీ హయాంలో ఎప్పుడయినా ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసారా? అసలు ప్రధాని హైదరాబాద్ వస్తే కూడా వెళ్లి కలవని, సెక్రటేరియట్ కు వెళ్లని సీఎంను చూసాము. నెల రోజుల్లో 8 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. వారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. హరీష్ రావు మాటల్లో అసూయ కనిపిస్తోంది. ప్రతిరోజూ ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్, హరీష్ రావు ఆగమాగం అవుతున్నారు. కొంచెం ఓపిక పట్టండి..మీకే అర్దమవుతుందని బండ్ల గణేష్ అన్నారు. మీ నేతలు ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్య వాతావారణం ఉంటుంది. సెక్రటేరియట్ కు అన్ని వర్గాల ప్రజలు వస్తున్నారు. వారి సమస్యలు చెప్పుకుంటున్నారని గణేష్ పేర్కొన్నారు.

Exit mobile version