Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‎గా ఏకగ్రీవంగా ఎన్నికయిన అయ్యన్న పాత్రుడు

ఏపీ అసెంబ్లీ స్పీకర్‎గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చైర్‎లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చోపెట్టారు. 16వ స్పీకర్‎గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు అభినందనలు తెలిపారు.

  • Written By:
  • Updated On - June 22, 2024 / 12:39 PM IST

Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‎గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చైర్‎లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూర్చోపెట్టారు. 16వ స్పీకర్‎గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు అభినందనలు తెలిపారు.

సభాధ్యక్షుడిగా బీసీ నేత..(Ayyanna Patrudu)

ఒక బీసీ నేత సభాధ్యక్ష స్థానంలో కూర్చోవడం సంతోషంగా ఉందన్నారు. అయ్యన్న పాత్రుడు గత ఐదేళ్లు అనేక ఇబ్బందులు పడ్డారని.. అనేక పోలీస్ స్టేషన్లలో 23 కేసులు పెట్టారని అన్నారు. అయ్యన్న పాత్రుడు రాజీలేని పోరాటం చేశారని చెప్పారు. గత ప్రభుత్వం సభను అప్రతిష్టపాలు చేసిందని.. తనను, తన కుటుంబాన్ని ఇష్టానుసారంగా మాట్లాడారని చంద్రబాబు అన్నారు. సీఎంగానే సభలో అడుగుపెడతానని చెప్పానని.. ప్రజల ఆమోదంతో సభలో సీఎంగా అడుగుపెట్టాన చంద్రబాబు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు. ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడివేడిని చూశారు.మీ వాగ్దాటి చూశారు. నేటి నుంచి మీ హుందాతనం చూస్తారని అన్నారు. వైసీపీ వాళ్లు విజయాన్ని తీసుకున్నారు కానీ.. ఓటమిని తట్టుకోలేక పోయారని విమర్శించారు. ఈ రోజు సభలో లేకుండా వెళ్లిపోయారని అన్నారు.