Site icon Prime9

Asaduddin Owaisi: దమ్ముంటే నాపై పోటీచేయి.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఒవైసీ సవాల్

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మజ్లిస్ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ బలం నీకు తెలియదు మా బలాన్ని గుర్తించి మీ నానమ్మ ఇందిరాగాంధీ దారుసలాంకు వచ్చిందన్నారు. ఈ గడ్డం టోపీదారులే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు.

మజ్లిస్ అంటే ద్వేషం..(Asaduddin Owaisi)

రాహుల్‌ గాంధీకి మజ్లిస్ అంటే ద్వేషం అని.. రాహుల్ గాంధీ సన్నిహితులు సింధియా, జితిన్ ప్రసాద్ వంటివారు బీజేపీలో చేరారని ఆరోపించారు. డబ్బు కోసం వెళ్లినవారిపైన ఎలాంటి ఆరోపణలు చేయరని అసద్ అన్నారు. తనలాంటి వారిపై మాత్రం డబ్బు మనిషని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తలపై టోపీ ముఖానికి గడ్డం ఉండడమే కారణమా ఆరోపణలకి కారణమా అని ప్రశ్నించారు.నాపై కావాలనే రాహుల్‌ అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల ముందు నా ఇంటికి ఎవరిని పంపావో పేరు చెప్పమంటవా అంటూ అన్నారు. రేవంత్‌ ఓటుకు నోటు కేసుపై రాహుల్‌ ఎందుకు నోరు మెదపటం లేదో చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఎంపీ ప్రభాకర్ పై మీ కార్యకర్త దాడి చేస్తే ఎందకు స్పందించలేదు? దమ్ముంటే నాపై బరిలోకి దిగు.. తేల్చుకుందాం అంటూ ఒవైసీ సవాల్ చేసారు.

తెలంగాణలో 9 స్దానాల్లో పోటీ..

తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని తొమ్మిది నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఒవైసీ చెప్పారు. శుక్రవారం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన అసదుద్దీన్ ఒవైసీ.. ప్రస్తుతమున్న ఏడు నియోజకవర్గాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోనూ పోటీ చేయనున్నట్టు చెప్పారు.సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు సయ్యద్‌ అహ్మద్‌ పాషా క్వాద్రీ, ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌లను జాబితా నుంచి తొలగించామన్నారు. మాజీ మేయర్లు జుల్ఫికర్‌ అలీ, మాజిద్‌ హుస్సేన్‌ వరుసగా చార్మినార్‌, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. జాఫర్ హుస్సేన్ మెరాజ్ యాకుత్‌పురా నుంచి, అహ్మద్ బలాలా మలక్‌పేట నుంచి, అకబరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేయనున్నారు. కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్‌కు వరుసగా మూడోసారి టికెట్ లభించింది. రెండో జాబితాలో బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, రాజేందర్ నగర్ అభ్యర్థులను ప్రకటిస్తారు. తమ పార్టీ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుందని ఒవైసీ స్పష్టం చేసారు.

Exit mobile version