Site icon Prime9

Revanth Reddy: కీలక పోస్టులన్నీ బీహార్ వారికేనా? తెలుగువారు గుర్తుకు రాలేదా?.. రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. కీలక పోస్టులన్నింటిని బీహార్ రాష్ట్రానికి చెందిన వారికే కట్టబెడుతున్నారని.. పదవుల కేటాయింపులో తెలుగువారు గుర్తుకు రావడం లేదా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తాజాగా ఐపీఎస్ బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. దీనితో బీహార్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు ముఖ్యమైన శాఖలు, కీలక పదవులు కట్టబెట్టారని రేవంత్ ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా, రజత్ కుమార్, అధర్ సిన్హా, వికాస్ రాజ్ వంటి వారికి కీలక పదవులిచ్చారని తాజాగా ఇన్‌ఛార్జ్ డీజీపీ పదవిని కూడా అంజనీ కుమార్‌కు అప్పగించారని రేవంత్ రెడ్డి అన్నారు. పదవుల కేటాయింపులో తెలుగువారు గుర్తుకు రాలేదా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జీ డీజీపీగా అంజనీకుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారంనాడు ఉత్తర్వలు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31వ తేదీన రిటైర్ కానున్నారు. దీంతో ఇంచార్జీ డీజీపీగా అంజనీకుమార్ ను ప్రభుత్వం నియమించింది. 1990 బ్యాచ్ కు చెందిన అంజనీకుమార్ 2018 మార్చి 12న హైద్రాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయనను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు.

Exit mobile version