Rajamahendravaram: ఏపీలో అధికార పార్టీ శ్రేణుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్ర పై వైకాపా ఎంపీ భరత్ వర్గీయులు రెచ్చగొడుతూ వారిపై నీళ్ల బాటిళ్లను విసిరారు. దీంతో రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది.
అమరావతి టు అరసువళ్లి పేరుతో రాజధాని రైతులు మహా పాదయాత్రను కోర్టు అనుమతితో నిర్వహిస్తున్నారు. గడిచిన 37 రోజులుగా వైకాపా శ్రేణులు, ప్రభుత్వం, మంత్రివర్గం పలు అసభ్యకరంగా పాదయాత్ర చేస్తున్న రైతుల నుద్ధేశించి మాట్లాడారు. పలు జిల్లాల మీదుగా సాగుతున్న వారి పాదయాత్రలో హేళన మాటలతో వారిని రెచ్చగొట్టారు. అయినా రైతులు ఓపికతో, రాజధాని సమస్య ఓ కొలిక్కి రావాలన్న ఆలోచనతో వైకాపా ఆటలను పట్టించుకోకుండా వారి యాత్రను కొనసాగిస్తూ వచ్చారు.
దీంతో వైకాపా శ్రేణులు నేడు ఏకంగా రైతుల పై దాడులకు తెగబడ్డారు. రాజమహేంద్రవరం నగరంలో పాదయాత్రగా వెళ్తున్న రైతులను రెచ్చగొట్టిన వైకాపా కార్యకర్తలు వాటర్ బాటిళ్లను వారిపైకి విసిరారు. ఆజాద్ చౌక్ మీదుగా శాంతియుతంగా రైతులు, అఖిలపక్ష నేతలు వెళ్తుండగా నల్ల బెలూన్లు ప్రదర్శిస్తూ వైకాపా శ్రేణులు ఈ దశ్చర్యకు పాల్పొడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. రెండు వైపుల పోటీ నినాదాలు చేసుకొన్నారు.
వైకాపా ఎంపీ భరత్ రెచ్చగొట్టేలా వ్యవహరించడంతో పాద యాత్రికుల పై వాటల్ బాటిళ్లను విసిరిన్నట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఒక దశలో చోధ్యం చూశారు. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ పర్యటనలో రెచ్చగొట్టిన వైకాపా మంత్రుల మాదిరిగానే నేడు కూడా వైకాపా వర్గీయులు రైతులను రెచ్చగొట్టారు. వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర ప్రజల మద్య చిచ్చు రగిలిస్తున్నారని ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: క్రిమినల్ రాజకీయ నాయకులంటే నాకు అసహ్యం.. పవన్ కల్యాణ్