Site icon Prime9

Ap Assembly Deputy Speaker: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల నామినేషన్‌

Kolagatla-Veerabhadra-Swamy-Files-Nomination

Amaravati: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం నామినేషన్‌ దాఖలుచేశారు. శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులవద్ద నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసారు. ఈ పదవికి ప్రతిపక్షం పోటీ పడనందున కోలగట్ల ఏకగ్రీంగా ఎన్నిక కానున్నారు.

విజయనగరం జిల్లాకు చెందిన వీరభద్ర స్వామి ఈ ఏడాది జరిగిన మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించినా పదవి దక్కలేదు. మరోవైపు వైశ్యకులానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్ ను క్యాబినెట్ నుంచి తప్పించినా ఆ సామాజిక వర్గం నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. రాష్ట్ర క్యాబినెట్‌లో కొన్ని కులాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే విమర్శలు కూడా వచ్చాయి.

ఈ నేపధ్యంలో కోలగట్లను డిప్యూటీ స్పీకర్ గా నియమించాలని సీఎం జగన్ భావించారు. దీనితో ఆ పదవిలో వున్న కోన రఘుపతి గురువారం రాజీనామా చేసారు. కోలగట్ల ఎన్నిక లాంచనప్రాయం కానుంది.

Exit mobile version