YS Viveka Murder Case: అవినాష్‌ రెడ్డి తల్లికి ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి- హైకోర్టులో సునీతారెడ్డి మెమో

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏపీ ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్ట్ శరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏపీ ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి మే 31న తెలంగాణ హైకోర్ట్ శరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్‌కు తరలించారు. దానితో అప్పటి నుంచి అవినాష్ రెడ్డి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

కోర్టును అవినాష్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నాడు(YS Viveka Murder Case)

కాగా గతవారంలో అవినాష్ రెడ్డి బెయిల్ విషయంలో హైకోర్టులో జరిగిన వాదనల్లో తన తల్లికి శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు ఆయన చెప్పారని, దాని ప్రకారం శస్త్రచికిత్స జరగలేదని వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ హైకోర్టుకు ఆమె మెమో సమర్పించారు. తన తల్లి శ్రీలక్ష్మికి గుండె కవాటాలు మూసుకుపోవడంతో ఆపరేషన్ ప్రక్రియ జరుగుతోందని ఎంపీ అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొనడంతో తుది ఉత్తర్వులు జారీ చేసేదాకా తనని అరెస్టు చేయకూడదంటూ హైకోర్టు మే 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టును అవినాష్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నాడని సునీతరెడ్డి తెలిపింది. తన తల్లి ఆరోగ్య విషయమై కోర్టుకు తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు వివరించింది. అది నిజమని తేలితే ఆయనపై చర్యలు తీసుకోవల్సిందిగా ఆమె తన మెమోలో హైకోర్టును విన్నవించుకుంది. మీడియా కథనాల ప్రకారం ఆమెకు శస్త్రచికిత్స జరగలేదని తెలిసిందని సునీత వివరించారు.

శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స జరుగుతోందన్న ప్రకటన తప్పు అని, నిర్ధారించడానికి సరైన రికార్డులు లేనందున అవినాష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సునీతారెడ్డి తరఫు న్యాయవాది కోరారు. శస్త్రచికిత్స జరిగినట్లు రికార్డులేమీ లేవని, మెమోను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీనితో సునీతరెడ్డి మెమోను న్యాయమూర్తి స్వీకరించారు.