Ys Avinash Reddy: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 27న హైకోర్టు ఇరు వైపు వాదనలు విని తీర్పును హోల్డ్ లో ఉంచింది. ఈ కేసు బుధవారం తీర్పు వెల్లడించింది. అయితే అవినాష్ రెడ్డి బెయిల్ మంజూరు విషయంలో హైకోర్టు కొన్ని షరతులు విధించింది.
ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట విచారణ కు హాజరు కావాలి.
సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యులను ప్రభావితం చెయొద్దని అవినాష్ కు ఆదేశం.
తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇటీవల బుధవారం వరకు అవినాశ్ ను అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ముందస్తు బెయిల్ రావడంతో అవినాశ్‌కు భారీ ఊరట లభించింది.