Flexis in Ippatam: వైసీపీ సర్కార్ కొత్త డ్రామా.. మీ డబ్బులు మాకొద్దంటూ ఇప్పటంలో ఫ్లెక్సీలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సర్కార్ పరోక్షంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇటీవల రోడ్డు విస్తరణ కోసం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారడం. బాధితులకు పవన్ అండగా నిలిచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - November 10, 2022 / 12:30 PM IST

Ippatam Village: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సర్కార్ పరోక్షంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇటీవల రోడ్డు విస్తరణ కోసం ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత వివాదాస్పదంగా మారడం. బాధితులకు పవన్ అండగా నిలిచి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో పవన్ కు పేరు వచ్చేస్తుందని భయపడ్డ వైసీపీ నేతలు కొత్త డ్రామాకు తెరతీసారు.

కొందరు బాధితుల ఇళ్లముందు మాపై ఎవరూ సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని, వారిచ్చే డబ్బులు కూడా మాకు వద్దంటూ ఇళ్లముందు ఫ్లెక్సీలు పెట్టారు. డబ్బులిచ్చి అబద్దాలు నిజం చేయాలని ప్రయత్నించొద్దంటూ సూచించారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంప్థ అభివృద్దికి ముఖ్యమంత్రి జగన్ రూ.137 కోట్లు కేటాయించారని, అందులోంచి కేవలం ఇప్పటం అభివృద్దికే ఆరు కోట్లను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కేటాయించారంటూ భారీ ప్లెక్సీలు కూడా వెలిసాయి. ఏఏ పనులకు ఎంతెంత కేటాయించారో ప్లెక్సీల్లోపేర్కొన్నారు.

కొద్దకాలం కిందట ఇప్పటంలో జనసేన బహిరంగ సభకు స్దలాన్ని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు ప్రకటించారు. వీటితో ప్రజోపయోగకరమైన పనులు చేసుకోవచ్చని స్దానికులు సంతోషపడ్డారు. అపుడు కూడ వైసీపీ సర్కార్ అడ్డుపడింది. ఈ నిధులు స్దానిక అధికార యంత్రాంగానికి ఇవ్వాలని వాటితోమ మౌళిక సదుపాయాలు కల్పిస్తామంటూ చెప్పింది. మొత్తం మీద వైసీపీ సర్కార్ కు పవన్ ఇమేజ్ ఎక్కడ పెరిగిపోతందోనంటూ భయం పట్టుకుంది.