Site icon Prime9

Chandrababu Naidu: వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది.. చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu

Chandrababu Naidu

Andhra Pradesh: ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుందన్నారు. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయని, ఇక మిగిలింది ప్రభుత్వ పతనమేని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు

ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. 600 ఇళ్లున్న ఇప్పటం గ్రామంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా? మీ దుర్బుద్ధి, రాజకీయ కక్ష ప్రజలకు అర్థం కాదు అనుకుంటున్నారా? మీవి రోడ్లు వేసే మొహాలేనా? అని ప్రశ్నించారు.

ఇప్పటం గ్రామం వెళుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను అడ్డుకుంటేనో, చీకట్లో మా పర్యటన పై రాళ్లు వేస్తేనో మీరు పైచేయి సాధించలేరు. కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి. ఆ తృప్తి ఏంటో అర్థం అవుతుంది. జగన్ పని అయిపోయింది అని చంద్రబాబు వరుస ట్వీట్లు చేసారు.

Exit mobile version