Site icon Prime9

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు

VASIREEI PADMA

VASIREEI PADMA

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇష్టం ఉన్నవాళ్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది.పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయనకు నోటీసులు పంపింది.

రూ. కోట్లు, రూ. లక్షలు, రూ. వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా అని ప్రశ్నించింది. మహిళలను ఉద్దేశించి స్టెపినీ అనే పదం పవన్ కల్యాణ్ ఉపయోగించడం ఆక్షేపణీయం అని పేర్కొంది. చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకుని తక్షణం క్షమాపణ చెప్పాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. భరణం ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చని పవన్ అనడం బాధించిందని మవాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ నోటీసులపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version