Site icon Prime9

Janasena Party: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలోని మహిళా కమీషన్

Where is the women's commission in the state.. Jana Sena party which remembered the events

Where is the women's commission in the state.. Jana Sena party which remembered the events

Andhra Pradesh: రాష్ట్రంలో మహిళా కమీషన్ ఎక్కడ? ఘటనలను గుర్తుచేసిన జనసేన పార్టీ బాధ్యతలు ఎంతమేరకు నిర్వహిస్తున్నారో ఆ పార్టీ గుర్తు చేసింది. ఓ పార్టీకి కొమ్ముకాసేలా రాష్ట్ర మహిళా కమీషన్ వ్యవహారిస్తున్న తీరును సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ఎండగట్టింది. వైకాపా పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో చోటుచేసుకొన్న అనేక నేరాలు, అసభ్యకరమైన మాటల సమయంలో మహిళా కమీషన్ నేతలు ఎందుకు స్పందించలేదంటూ వాస్తవాలను నెట్టింట వైరల్ చేశారు.

రాష్ట్ర మంత్రి అండతో గుడివాడలో సంక్రాంతి సంబరాల పేరుతో భోగ వస్తువుగా మహిళలను చీర్ గాళ్స్ గా చూపించిన ఘటనలో మీరెక్కడున్నారు అంటూ ప్రశ్నించారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ మహిళలను తక్కువ చేసి మాట్లాడిన వైసీపీలో మంత్రుల కట్టడిలో రాష్ట్ర మహిళా కమిషన్ ఎక్కడంటూ నిలదీశారు. వైసీపీ పార్టీలో మహిళలతో అసభ్యకరంగా మాట్లాడితే మంత్రి పదవి ఇచ్చిన విషయం పై ఎందుకు ప్రశ్నించలేదు. ఇంకేం చేసుద్ది, ఒక గంట వచ్చి వెళ్లిపో లాంటి మాటలతో మహిళలను లొంగదీసుకొనే పనులు చేసిన వైసీపీ ప్రజా ప్రతినిధులు పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు.

ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్‌లో ఆ వ్యక్తి దొరికితే, కనీస నైతిక బాధ్యత మర్చిపోయిన మహిళా కమీషన్ నేతలు ఆ సమయంలో ఎక్కడున్నారన్నారని ఎద్దేవా చేశారు. మే 2022లో సీఎం జగన్ సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలిక పై సుమారు ఏడాది పాటు అత్యాచారం జరిగిన్నప్పుడు మహిళా కమీషన్ ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 2021లో మహిళల పై చోటుచేసుకొన్న కేసుల సంఖ్య 25% పైగా పెరిగిందని రాష్ట్ర పోలీసులు డిసెంబర్ 28, 2021న వెల్లడించారు. దీనిపై ఎందుకు పెదవి విప్పలేదో చెప్పాలన్నారు. జరుగుతున్న అత్యాచారాలకు తల్లి పెంపకమే లోపం అని స్వయానా రాష్ట్ర హోం మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మహిళా లోకాన్ని, మాతృమూర్తులను అవమానించడం కాదా? ఆ సమయంలో మీరు ఎక్కడవున్నారు? ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. అత్యాచారం చేసేందుకు రాలేదు. దొంగతనం కోసం వచ్చిన క్రమంలో అత్యాచారం చేశారు అని రాష్ట్ర హోం మంత్రి మృగాళ్లకు సర్టిఫికేట్ ఇచ్చిన సంగతిని మరిచిన్నట్లు ఉన్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు.

తొలి నుండి అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న రాష్ట్ర మహిళా కమీషన్, ప్రతిపక్షాల పై మాత్రం నిత్యం కాలు దువ్వుతూ ఉంటారు. వాస్తవానికి మహిళా కమీషన్ అనేది ఓ బాద్యతాయుతమైన పదవి. రాబందుల చెరలోని వారికి అండగా నిలబడి, బాపూజి కన్న కలలను నిజం చేయాల్సిన బాధ్యత చేపట్టాల్సిన ఏపీ మహిళా కమీషన్, కేవలం రాజకీయలకే పరిమితం కావడం పట్ల ప్రజల్లో విముఖుత వ్యక్తం అవుతుంది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు

Exit mobile version