Site icon Prime9

Janasena: జనసైనికులకు కోర్టు షాక్..!

court given shok to janasena leaders

court given shok to janasena leaders

Janasena: జనసైనికులకు కోర్ట్ షాక్ ఇచ్చింది. విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలకు కోర్టులో షాక్‌ తగిలింది.

పవన్ విశాఖ పర్యటనలో భాగంగా విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఆ దాడికి జనసేన కార్యకర్తలే నిందింతులంటూ వారిని  పోలీసులు అరెస్ట్‌ చేసి ఆదివారం రాత్రి జిల్లా కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు అరెస్ట్ అయిన వారిలో 61 మంది జనసైనికులను రూ.10వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. కాగా మరో 9 మంది నేతలకు ఈనెల 28 వరకు రిమాండ్ విధించారు.

అయితే వారికి బెయిల్‌ ఇవ్వమని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కారు జనసేన నేతలు కానీ, కోర్టులో జనసైనికులకు చెక్కెదురైంది. జనసేన వేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు రద్దు చేసింది. అదే సమయంలో వారిని పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాగా అరెస్ట్ అయిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

ఇదీ చదవండి: అలా చేస్తే “ప్యాకేజీ స్టార్” మాటను వెనక్కి తీసుకుంటాం- పేర్నినాని సవాల్

Exit mobile version
Skip to toolbar