Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పోలీసులపై గ్రామస్ధులు దాడి చేశారు. ఇరువర్గాల మద్య చోటుచేసుకొన్న ఓ ఘటన నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకొనింది.
వివరాల్లోకి వెళ్లితే, లొద్దపుట్టి గ్రామంలో రెండు రోజుల క్రితం యువకుల మద్య వాగ్వాదం కొట్లాటకు దారితీసింది. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. నేడు గ్రామస్ధులంతా కలిసి సమావేశం నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు గ్రామానికి చేరుకొన్నారు. సమావేశాన్ని అడ్డుకొన్నారంటూ ఎస్సై రామకృష్ణ, పోలీసు సిబ్బందిపై గ్రామస్ధులు సమిష్టిగా దాడులు చేశారు.
మరోవైపు పోలీసులు గ్రామాల మద్య చిచ్చురేపుతున్నారన్న వాదనలు లేకపోలేదు. లొద్దపుట్టి గ్రామవాసులు టపాకాయలు పేల్చుకొనేందుకు వీలేలేదన్న కారణంగా గ్రామస్ధులు తిరగబడిన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఏపీ పోలీసులు ప్రవర్తనతో పలు ప్రాంతాల్లో చిచ్చు రేగుతుంది.
ఇది కూడా చదవండి: Youth died: జలపాతంలో నీటమునిగి ఆంధ్ర యువకుడు మృతి…