Site icon Prime9

Vijayawada: దుర్గ గుడి ఈఓపై హైకోర్టు ఆగ్రహం.. స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశం

durga temple eo bramarambha got high court notice

durga temple eo bramarambha got high court notice

Vijayawada: జనవరి 5వ తేదీ గురువారం ఉదయం 10:30 నిమిషాలకు హైకోర్టుకు స్వయంగా హాజరు కావాలని ఇంద్రకీలాద్రి దుర్గ గుడి ఈవోకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దుర్గగుడి ఈఓ గా భ్రమరాంబ వచ్చిన తర్వాత ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చారు. తమ జూనియర్లను పర్మినెంట్ చేసిన దుర్గగుడి ఈ ఓ తీరుపై పలువురు తాత్కాలిక ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. తాము సీనియర్లమని తమ కన్నా జూనియర్లని శాశ్వత ఉద్యోగులుగా చేశారని తమని కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని న్యాయస్థానానికి విన్నవించారు.

దీనిపై కోర్టు తీర్పు ఇస్తూ ముగ్గురు జూనియర్ తాత్కాలిక ఉద్యోగులను ఏ విధంగా అయితే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించారో అదేవిధంగా హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు గుర్తించాలని ఆదేశాలు ఇచ్చింది.

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వారిని శాశ్వత ఉద్యోగులుగా గురించని కారణంగా ఈవో పై సదరు ఉద్యోగులు మళ్ళి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆదేశాలని అనుసరించి వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించని కారణంగా స్వయంగా దుర్గ గుడి ఈ ఓ గురువారం ఉదయం 10:30 నిమిషాలకు హైకోర్టుకు హాజరవ్వాలని ఆదేశాలిచ్చింది.

Exit mobile version