Site icon Prime9

MP Vijaya Sai Reddy: ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించింది యనమలనే.. విజయసాయి రెడ్డి

vijayasai-reddy

Andhra Pradesh: టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి పై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించింది యనమలనే అంటూ విజయసాయి ట్వీట్ చేసారు. బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఉపాధి దొరికి యువత స్వతంత్రులవుతారన్నది టీడీపీ ఏడుపు అని, కేంద్రం వేయి కోట్ల గ్రాంట్ ఇస్తుందన్నారు. ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించిన దుర్మార్గపు యనమల సొంత జిల్లా గొంతు కోస్తున్నాడని ఆగ్రహించారు. బల్క్ డ్రగ్ కేపిటల్ గా ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ కాలుష్యమయం అయిపోయిందా మలమల అంటూ చురకలు అంటించారు.

మహానాడుకు వచ్చిన జనం గట్టిగా చప్పట్లు కొట్టారు. అది చూసి పార్టనర్ తో పొత్తే లేదన్నారు తెలుగు తమ్ముళ్లు. పచ్చకుల మీడియా ప్రచారం వాపే తప్ప బలుపు కాదని లేటుగా గ్రహించిన చంద్రబాబు మళ్లీ పొత్తులంటూ వెంపర్లాట. పచ్చ కుల మీడియా నీకు పట్టం కట్టినా, జనం ఛీ కొడుతున్నారు బాబూ అంటూ మరో ట్వీట్‌ లో విజయసాయిరెడ్డి ఎద్దేవా చసారు.

Exit mobile version