Varahi Yatra: జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రకు శంఖారావం పూరించారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ సభ జనసంద్రోహం అయింది.
బహిరంగ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..‘నా స్పీచ్ లు విన్నపుడు.. చాలా ఆవేశంగా దేశపు జెండాకు ఉన్న పొగరుంది. ఆ మాటలన్నీ వినప్పుడు నేనేనా ఇవి మాట్లాడిందని. ఈ పదేళ్లు.. ఒక పార్టీ పెట్టి నడిపించడమనేది సాధ్యం కాదు. 10 వేల కోట్లు ఉన్నా పార్టీ నడవలేరు. గుండెల్లో పెట్టుకునే ప్రజాభిమానం ఉండేనే పార్టీని నడపగలం. ఆ పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకునే వాళ్లు ఉంటేనే పార్టీని నడపగలం. ఈ సభకు చాలామంది యువత వచ్చారు. నూనూగు మీసాల యువతున్నారు. ఆడపడచులు వచ్చారు. నన్ను ఏడిపించే అమ్మాయిలున్నారు… ఇలా సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా వందనాలు.
ఒక వ్యక్తి బలిదానం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈరోజు ఆంధ్రా ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తులు ముందుగా మోకరిల్లాల్సింది ఆ ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన వ్యక్తికి. ఆయనే అమరజీవి పొట్టి శ్రీరాములు. కానీ, మన నాయకులు ఆయనను తూతూమంత్రంగా గుర్తు చేసకుంటున్నారు. అయితే పొట్టి శ్రీరాములు స్పూర్తిని నింపుకుని జనసేన పార్టీ పుట్టింది.’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.