Site icon Prime9

TDP: తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

TDP

TDP

TDP Twitter Account: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కి చెందిన అధికారిక ట్విట్టర్‌ ఖాతా(జైటిడిపి) హ్యాకింగ్‌కు గురైనట్లు టిడిపి డిటిజల్‌ వింగ్‌ శనివారం మధ్యాహ్నం ఓ ప్రకటన చేసింది. తమ పార్టీ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను హ్యాక్‌ చేశారని తెలిపింది. అకౌంట్‌ హ్యాక్‌ అవ్వడం వెనుక వైసిపి మద్దతుదారులు ఉన్నారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. ట్విటర్‌ హ్యాండిల్‌లో క్యూక్యూఎల్‌ క్రియేటర్‌ అని రాసి ఉందని, దీనిపై ఫిర్యాదు చేశామని మరికాసేపట్లోనే తిరిగి పునరుద్ధరిస్తామని టిడిపి డిటిజల్‌ వింగ్‌ వెల్లడించింది.

టీడీపీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసి టైలర్ హబ్స్‌గా అకౌంట్ పేరును మర్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులే టీడీపీ ట్విట్టర్ అకౌంట్‌లో కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ ట్విట్టర్ ఖాతాను పునరుద్దరించేందకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గతంలోనూ టీడీపీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సారి ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌ కావడం గమనార్హం.

Exit mobile version