Site icon Prime9

Telugu Desam Party : చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి

Telugu Desam Party leaders lokesh and bhuvaneswri, brahmani tweets about cbn health

Telugu Desam Party leaders lokesh and bhuvaneswri, brahmani tweets about cbn health

Telugu Desam Party : తెదేపా అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని నారా లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆపోస్ట్ లో చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. అదే విధంగా చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే అందుకు జగన్‌దే బాధ్యత అన్నారు. అలానే చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారని.. తగినంత భద్రత లేక చంద్రబాబు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. జైలులో చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దోమలు, కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌, అలర్జీతో బాధపడుతున్నారు అని ట్వీట్‌ లో రాసుకొచ్చారు.

 

జైలులో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని నారా బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆయనను అపరిశుభ్రమైన జైలులో నిర్బంధించడం హృదయవిదారకం. ఆయన ఆరోగ్యంపై అపరిశుభ్రత తీవ్ర ప్రభావం చూపుతోంది. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం అందట్లేదు. తక్షణ వైద్య సహాయం అవసరం’ అని అన్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘జైలులో నా భర్తకు సకాలంలో వైద్యం అందించట్లేదు. ఇప్పటికే ఆయన 5 కిలోల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. జైలులో ఓవర్‌హెడ్‌ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యవసరం వైద్యం అవసరం’’ అని తెలిపారు.

 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం క్షీణించడం పట్ల సర్వత్రా ఆందోళన నెలకొన్న దృష్ట్యా… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలతో జాతీయపార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

 

Exit mobile version