Site icon Prime9

YCP MLAs: క్రాస్ ఓటింగ్.. నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

Sajjala Ramakrishna Reddy

sSajjala Ramakrishna Reddy

YCP MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పెద్ద దుమారమే రేపుతోంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్సార్ సీపీ సస్పెండ్ చేసింది. వారిని సస్పెండ్ చేసినట్లు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

సజ్జల అధికారిక ప్రకటన (YCP MLAs)

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పెద్ద దుమారమే రేపుతోంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్సార్ సీపీ సస్పెండ్ చేసింది.

వారిని సస్పెండ్ చేసినట్లు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

తాజాగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్‌ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది వైఎస్సార్‌సీపీ.

ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్‌ ఉల్లంఘించినందుకుగానూ, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారాయన.

ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేస్తున్నట్లు తెలిపారు.

ఈ నలుగురు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని చెప్పారు సజ్జల.

క్రాస్‌ ఓటింగ్‌పై అంతర్గత విచారణ జరిపాం. దర్యాప్తు తర్వాతే నలుగురిపై చర్యలు తీసుకున్నాం.

మాకున్న సమాచారం మేరకు.. డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తోంది. ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్‌ చేశారు.

క్రాస్‌ ఓటింగ్‌ చేసినవాళ్లకు టికెట్‌ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చు అని సజ్జల మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది.

23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు.

కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి… 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి.

వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు.

వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టీడీపీకి పడ్డాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

సీరియస్ గా తీసుకున్న వైసీపీ..

ఇలా ఉండగా ఆనం, కోటంరెడ్డి కాకుండా అనూరాధకు ఓటు వేసిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది, వైసీపీ దీన్ని సీరియస్ గా తీసుకుంది.

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై వైసీపీ నేతలతో చర్చిస్తున్నారు.

క్రాస్ ఓటింగ్ ఎలా జరిగింది? ఎందుకు జరిగిందనే దానిపై చర్చ మొదలయింది.

అయితే ఇపుడు టీడీపీ అభ్యర్ది అనూరాధ గెలవడంతో వారు షాక్ తిన్నారు.

గురువారం సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.

Exit mobile version