Site icon Prime9

AP Assembly: ఏపి అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యుల సస్పెస్షన్

ASSEMBLY

ASSEMBLY

Amaravati: ఏపి అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. సభలో కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతున్నారంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సస్పెన్షన్ తీర్మానం ప్రతిపాదించగా స్పీకర్ వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. టీడీపీ ఈ ఉదయం సభ ప్రారంభం సమయంలో రైతు సమస్యల పైన వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని ప్రశ్నోత్తరాల తరువాత స్పీకర్ తిరస్కరించారు.

ఉదయం వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ, తెలుగు రైతు ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎడ్లబండి కాడె మోస్తూ అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అయితే, తెలుగుదేశం నిరసనకు ఎడ్ల బండి ఇచ్చిన రైతును సీఐ తీవ్రంగా కొట్టారంటూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతుని కొట్టిన అంశం పై అసెంబ్లీలోనూ నిరసన తెలుపుతామన్నారు. తరువాత సభ ప్రారంభమైన సమయం నుంచి రైతుల పైన పోలీసులు కేసులు పెట్టటం, కొట్టడం పై టీడీపీ ఆందోళనకు దిగింది.

వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సభలో అడ్గు తగిలారు. దీంతో, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నా, టీడీపీ సభ్యులు బయటకు వెళ్లాలని డిసైడ్ అయ్యే ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దీనితో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తీర్మానం చేసారు. ప్రస్తుత సమావేశాలు జరిగిన రెండు రోజులు వరుసగా టీడీపీ సభ్యుల పైన సస్పెన్షన్ వేటు పడింది.

Exit mobile version