AP Capitals : ఏపీ మూడు రాజధానుల విషయం.. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి..

ఏపీలో మూడు రాజధానుల విషయం ఇపుడు దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. ఇప్పటికే రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ఇచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా ఆదేశించింది. అలాగే సీయార్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ఈ తీర్పు వెలువడి కొన్ని నెలలు గడిచాయి... ఇలాంటి తరుణంలో ఏపీ సర్కారు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడం ఉత్కంఠ రేపుతోంది.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 07:47 PM IST

AP Capitals : ఏపీలో మూడు రాజధానుల విషయం ఇపుడు దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. ఇప్పటికే రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ఇచ్చి అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంది. అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని కూడా ఆదేశించింది. అలాగే సీయార్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని సూచించింది. ఈ తీర్పు వెలువడి కొన్ని నెలలు గడిచాయి… ఇలాంటి తరుణంలో ఏపీ సర్కారు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కడం ఉత్కంఠ రేపుతోంది.

అమరావతే ఏపీ రాజధానని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది.. అది జరిగి నెలలు గడుస్తున్నా ఇన్నాళ్ళూ మౌనంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఉన్నఫళంగా సు కోర్టు తలుపు తట్టింది. ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు ఈ టైం లో దాఖలు చేయడం వెనక ఉన్న వ్యూహం ఏమిటి అన్నదే చర్చగా ఉంది. సాధారణంగా చూస్తే హై కోర్టు ఇచ్చిన తీర్పులనే సుప్రీం కోర్టు కూడా ఆమోదిస్తుంది. అదే సమయంలో కొన్ని కేసులలో సమీక్ష కూడా చేస్తుంది.ఇపుడు అలాంటిదే రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. పైగా హై కోర్టు తీర్పు మీద స్టే ఇవ్వాలని అడుగుతోంది. స్టే కనుక ఇస్తే అపుడు అమరావతి ఏకైక రాజధాని అన్న ప్రశ్న రాదు. దాంతో ప్రభుత్వం ఈ పిటిషన్ వేసింది. అయితే ఇక్కడ కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఉన్నాయి. అవేంటి అంటే శాసనసభలు దేన్ని అయినా చట్టం చేయవచ్చు. అలాగే కొన్నింటిని అవి రద్దు చేసుకోవచ్చు.

రాజ్యాంగం ప్రకారం అవి లేకపోతే కోర్టులు అడ్డుకుని తీరుతాయి. మళ్లీ రాజ్యాంగానికి అనుగుణంగా వాటిని రూపొందించి కోర్టు డైరెక్షన్ల మేరకు కొత్త చట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు తేవచ్చు. ఇలా అనేకరకాలుగా కోర్టు తీర్పులు ఉంటాయి. కానీ ఫలానా వాటి మీద చట్టాలు చేయవద్దు అని కోర్టులు ఆదేశించవచ్చా అన్నది మొదటి నుంచి వైసీపీలో జరుగుతున్న చర్చ.చట్టసభలు ఉన్నవే చట్టాలు చేయడానికి అని సీనిమర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు లాంటి వారు అంటున్నారు. అలాగని రాజ్యాంగాన్ని అతిక్రమించి చట్టాలు చేయడం కూడా చేయకూడదు. ఒక విధంగా చూస్తే అమరావతి రాజధాని అంశం అన్నది చాల సంక్లిష్టమైనది. రాజధాని లేకుండా ఏపీ ఏర్పడింది. విభజన చట్టాన్ని ఉభయ సభలూ ఆమోదించాయి. దాని మేరకు ఏపీ 2014 జూన్ 1 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఉంది.