Site icon Prime9

Telugu States: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు ప్రత్యేక సమావేశం

Meeting

Meeting

New Delhi: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై నేడు ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. వీరితో పాటు ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు, ఇతర కీలక శాఖల కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ముందస్తు సన్నాహాల్లో భాగంగా ఇప్పటికే రెండు రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు ఢిల్లీ చేరుకున్నారు.

సమావేశం ఏజెండాలో మొత్తం 14 అంశాలు ఉన్నాయి. ఎజెండాలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఏడు అంశాల పై చర్చ జరగనుంది. వీటిలో రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా, మరో ఏడు ఏపీకి సంబంధించిన అంశాలు. ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, షెడ్యూల్ 10 లోని సంస్థలు, చట్టంలో లేని ఇతర సంస్థలు, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్, బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజనలు, ఏపీ ఎస్సీ ఎస్సీఎల్, టీఎస్సి ఎస్ఎల్ క్యాష్ క్రెడిట్, 2014- 15 రైస్ సబ్సిడీ విడుదల పై చర్చ జరగనుంది.

వీటితో పన్నుల ప్రోత్సాహకాలు, ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు, ఆదాయ లోటు, పన్నుల్లో అటానమీ తొలగిరపు, రాజధానికి ఆర్ధిక సాయం, విద్యా సంస్థల ఏర్పాటు, రాజధానికి రాపిడ్‌ రైల్‌ కనెక్టవిటీ అంశాల పై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి నగదు నిల్వల పంపకాలు, ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల, అప్పులు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం ఎజెండాలో ప్రత్యేక హోదా అంశం లేదు.

Exit mobile version