Andhra Pradesh: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతే రాజధాని అన్న వారిని పొలిమేరల నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుందన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం కోసం పోరాడుతున్నాడని పేర్కొన్నారు. అందులో భాగంగానే మూడు రాజధానుల అంశంగా చెప్పుకొచ్చారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతించాలని విజ్నప్త చేశారు. విశాఖను రాజధాని చేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఏపీ మంత్రులు రెచ్చగొడుతూ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా స్పీకర్ తమ్మినేని ఏకంగా పొలిమేరల నుండే తరిమి కొట్టాలని పరోక్షంగా రైతుల నుద్ధేశించి మాట్లాడడం చర్చ నీయాంశంగా మారింది. కోర్టు అనుమతితో రైతులు పాదయాత్రం చేస్తున్న సంగతిని ఏపి ప్రభుత్వం మరిచిన్నట్లుగా ప్రవర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో అక్టోబర్ 25 నుండి ఫేస్ యాప్ హాజరు