Site icon Prime9

Somu Veerraju: ఢిల్లీలో సోము వీర్రాజు.. పవన్ వ్యాఖ్యలపై అధిష్టానికి వివరణ

Somu Veerraj in Delhi. Explanation to leaders on Pawan's comments

Somu Veerraj in Delhi. Explanation to leaders on Pawan's comments

Ap Politics: ఏపీలో గత నాలుగు రోజులుగా చోటుచేసుకొన్న జనసేన పరిణామాలను అధిష్టానంకు వివరించేందుకు భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ చేరుకొన్నారు. భాజన నేత శివ ప్రకాష్ జీకి వివరించారు.

విశాఖ ఘటన నేపథ్యంలో అధికార పార్టీ వైకాపా నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతకరంగా మారిందని ఢిల్లీ పెద్దలకు సోము తెలిపారు. అంతేగాకుండా రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న రాజకీయ సమీకరణలపై కూడా సోము వీర్రాజు అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు.

మంగళగిరిలో జనసేన సైనికుల సమావేశంలో పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే భాజపా తీరుపై కూడా కొంత అసహనంతో మాట్లాడారు. రూట్ మ్యాప్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయ అవసరం మేరకు తన విధానాలను మార్చుకొనే పరిస్ధితి ఏర్పడిందని కుండ బద్ధలు కొట్టిన్నట్లు చెప్పేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కు జరిగిన ఘటనను ఖండిస్తూ ఆయనకు సంఘీభావం తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ఈ నేపథ్యంలో వాస్తవాలను వివరించేందుకు సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్లారు. నేటి సాయంత్రం ఆయన తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.

ఇది కూడా చదవండి:Pawan Kalyan: భాష రాదనుకొంటే పొరపాటు.. వైకాపా శ్రేణులుకు పవన్ హెచ్చరిక

Exit mobile version