Site icon Prime9

Minister Dharmana : మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ట్విస్ట్ ఇచ్చిన మహిళ.. ఆ పార్టీకే ఓటు అంటూ

shcking reply by a woman to Minister Dharmana prasada rao

shcking reply by a woman to Minister Dharmana prasada rao

Minister Dharmana : వైకాపా మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఓ మహిళ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. శ్రీకాకుళంలోని ఎల్‌బీఎస్‌ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో గూనపాలేనికి చెందిన వై.ఆదిలక్ష్మికి ధ్రువపత్రాన్నిఅందించారు. ఆ తర్వాత ఏ పార్టీకి ఓటేస్తావని మంత్రి ధర్మాన అడిగారు. ఆమె వెంటనే ‘సైకిల్‌కు వేస్తా’ అన్నారు. మహిళ సమాధానంతో ఖంగుతిన్న మంత్రి ‘ఏయ్‌ చూడండి.. ఈవిడ సైకిల్‌కు ఓటేస్తుందట’ అని అందరితో చెప్పారు. మంత్రితో పాటు మహిళ సమాధానంతో అక్కడున్న వైఎస్సార్‌సీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

ఆ తర్వాత మంత్రి ఆమెతో మాట్లాడుతూ.. ఎవరికైనా ఓటేసుకోవచ్చు.. కానీ గోతిలో పడిపోతారు జాగ్రత్త అంటూ మంత్రి ధర్మాన హెచ్చరించారు. ఎన్నికలు దగ్గర పడటంతో చంద్రబాబు మోసం చేసేందుకు మళ్లీ హామీలు ఇస్తున్నారుని.. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. జగన్‌ చిన్నవాడు కాబట్టి అధికారంలోకి వచ్చాక ఎలా పరిపాలిస్తారో అనుకున్నానని.. కానీ అద్భుతమైన పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం కిష్టప్పేటలో జరిగిన కార్యక్రమంలో ధర్మాన పాల్గొన్నారు.

 

Exit mobile version