Site icon Prime9

Ap Assembly: ఏపీ అసెంబ్లీ ముందుకు ఏడు బిల్లులు

minister vidudala Rajini into tollywood

minister vidudala Rajini into tollywood

Amaravati: ఏపీ అంసెబ్లీ సమావేశాలు నాలుగోరోజు వాడివేడిగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా నేడు ఏడు బిల్లుల‌ను ఏపీ స‌ర్కార్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టింది. విద్య, వైద్యం, నాడు-నేడు పై సభలో చర్చ జరుగనుంది. శాసనసభ ముందుకు పెగాసెస్ నివేదిక కూడా నేడు రానుంది.

వైద్యానికి సంబంధించిన విషయం పై మంత్రి విడదల రజని మాట్లాడారు. విష జ్వరాల కట్టడికి తాము పటిష్ఠ చర్యలను తీసుకున్నామని చెప్పారు. విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి రజిని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చామని అసెంబ్లీ వేదికగా ఆమె పేర్కొన్నారు. మలేరియా, డెంగీ జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఆమె వివరించారు.

వైరల్ వ్యాధితో చిన్నారి సంధ్య మృతి చెందడం బాధాకరమని, ఆ చిన్నారి మృతికి సభలో మంత్రి నివాళులర్పించారు. సంధ్య మృతిని టీడీపీ మహిళా నేతలు రాజకీయం చేయడం దారుణమన్నారు.

ఇదీ చదవండి: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత… తాళ్లతో కట్టి మరీ… తెదేపా నేతల బలవంతపు అరెస్టులు

Exit mobile version