Site icon Prime9

Ayyanna Pathrudu: రుషికొండను చూడండి ఎలా తవ్వేసారో.. మోదీకి లేఖ వ్రాసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

See how Rushikonda was dug up...Former minister Ayyanyapatra wrote a letter to Modi

Andhra Pradesh: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలో రుషికొండను కళ్లారా చూడాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు. ఏరియల్ సర్వే ద్వారా రుషింకొండను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చెక్కేసిందో, అక్రమాలు సాగించిందో స్వయంగా వీక్షించాలని ప్రధానికి అయ్యన్యపాత్రుడు విజ్నప్తి చేశారు.

లేఖలో అమరావతి అంశాన్ని కూడా వ్రాశారు. అమరావతికి భిన్నంగా మూడు రాజధానులంటూ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరును కూడా అయ్యన్న వివరించారు. రాజధానిగా అమరావతి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్నప్తి చేశారు. దీనిపై ఓ స్పష్టత నిచ్చేందుకు ప్రధాని సమక్షంలో ఓ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యకు ముగింపు పలకాలన్నారు. పోలవరం పూర్తియ్యేలా చూడాలని లేఖలో కోరారు. ఈ నెలలో విశాఖలో ప్రధాని పర్యటించనున్నారు.

61ఎకరాల రుషికొండ హిల్ ఏరియాలో 9.88 ఎకరాల్లో ప్రాజెక్టుకు ఏపీటీడీసీ అనుమతి తీసుకోగా క్షేత్ర స్థాయి పరిశీలనలో రెండింతలు తవ్వకాలు జరిగిన్నట్లు గుర్తించారు. కొండ మద్యలో చిన్న భాగం తప్ప మిగిలిన హిల్ ను భారీగా తవ్వేశారు. పర్యవరణానికి విఘాతం కల్పిస్తూ వందలాది చెట్లను సైతం నరికేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్ధానాల్లో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆక్షేపణలు, అపరాధ రుసుం లు వడ్డించాయి. వ్యవహారం కూడా నడుస్తోంది.

ఇది కూడా చదవండి: State Secretary Srinivasa Rao: విధ్వంసకర పాలకులకు సీఎం జగన్ స్వాగతం పలకడమేంటి?

Exit mobile version