Site icon Prime9

Sajjala Ramakrishna Reddy : బందిపోటు దొంగ, మోసగాడు చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – సజ్జల రామకృష్ణా రెడ్డి

Sajjala Ramakrishna Reddy comments on chandrababu and tdp

Sajjala Ramakrishna Reddy comments on chandrababu and tdp

Sajjala Ramakrishna Reddy : బందిపోటు దొంగ, మోసగాడు చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై నెక్స్ట్ లెవెల్ లో ఆయన ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని సజ్జల ఆరోపించారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్కులతో ఏం చేస్తున్నారో ఈ మధ్యే బయట పడింది అని అన్నారు. 2014లో అడ్డంగా ఇచ్చిన హామీలు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా టీడీపీ అడ్డగోలు హామీలు ఇస్తుంది.. ఇలాంటి చర్యలను ఏ విధంగా శిక్షించాలో మరి అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్ళమీద పడుతోంది అప్రమత్తంగా ఉండాలి.. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ చంద్రబాబు 5 కోట్ల మందిని ప్రలోభపెట్టి మోసం చేస్తున్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యర్ధి పార్టీ ఓట్లు తప్పించి గెలుపు తెచ్చుకోవాలని 2019లో ప్రయత్నించాడు.. సేవామిత్ర యాప్ ద్వారా కూడా ఓట్ల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న పనులపై సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ కు కంప్లైంట్ చేస్తామన్నారు.

Exit mobile version