Site icon Prime9

YSRCP Social Media wing: సోషల్ మీడియా పై సీఎం జగన్ నజర్..

Sajjala Ramakrishna Reddy

sSajjala Ramakrishna Reddy

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ సోషల్ మీడియా పటిష్టతపై ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెరపైకి కొత్త పేరు వచ్చింది. ఇప్పటివరకు సోషల్ మీడియా బాధ్యతలు చూసిన విజయసాయిరెడ్డిని కాదని, సజ్జల తనయుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో భార్గవ్, సోషల్ మీడియా వింగ్ నేతలు తాజాగా భేటీ అయ్యారు. సోషల్ మీడియాతో పాటు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతను ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి చూస్తూ వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు సజ్జల కుమారుడికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించడం ఆ పార్టీలోనే చర్చనీయాంశమైంది.

వైసీపీ సీపీ సోష‌ల్ మీడియా బాధ్యుడిని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మార్చారు. ప‌లువురు ముఖ్య నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో జ‌గ‌న్ సోష‌ల్ మీడియాకి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల్లో సోష‌ల్ మీడియా అత్యంత శ‌క్తిమంత‌మైన ప్ర‌భావాన్ని చూపుతుండ‌డంతో జ‌గ‌న్ దానిపై దృష్టి సారించారు. ఈ నేప‌థ్యంలో నూత‌న బాధ్య‌త‌ల్ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న‌యుడు భార్గ‌వ్‌‌రెడ్డికి అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియా విభాగాన్ని మొద‌టి నుంచి విజ‌య‌సాయిరెడ్డి చూస్తున్నారు. త‌న‌కు నీడ‌లా ఉండే గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా సార‌థిగా విజ‌య‌సాయిరెడ్డి నియ‌మించారు. ఇటీవ‌ల ఆ బాధ్య‌త‌ల్ని మ‌రో న‌లుగురికి పంచారు. అదలా ఉంటే వైసీపీ సోష‌ల్ మీడియా గ‌త కొంత కాలంగా యాక్టీవ్‌గా ప‌ని చేయ‌డంలేద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ భావిస్తున్నారంట, అందుకే ఆయ‌న దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే వైసీపీ సోష‌ల్ మీడియా బాధ్యుడైన విజ‌య‌సాయిరెడ్డిని మార్చి, ఆయ‌న స్థానంలో స‌జ్జ‌ల కుమారుడు భార్గ‌వ్‌ను నియ‌మించినంత మాత్రాన, అది యాక్టివ్ అవుతుందా? అనే చ‌ర్చ‌ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. వైసీపీకి సోష‌ల్ మీడియా ఉప‌యోగ‌ప‌డాలంటే మారాల్సింది బాధ్యుడ్ని కాదు, దాని విధానాలు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు వైసీపీ కోసం చాలా మంది స్వ‌చ్ఛందంగా సోష‌ల్ మీడియాలో ప‌ని చేశారు. వివిధ కార‌ణాల‌తో చంద్ర‌బాబును ఎలాగైనా గ‌ద్దె దించాల‌ని, ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్‌కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌నే వారి కోరిక. అంతిమంగా వైసీపీకి రాజ‌కీయంగా క‌లిసొచ్చింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యారు. వైసీపీకి అధికారం వ‌చ్చిన త‌ర్వాత వైసీపీ పెద్ద‌లపై అదే సోష‌ల్ మీడియాలో సెటైర్స్ వెల్లువెత్తాయి. దీన్ని బ‌ట్టి వైసీపీ పెద్ద‌లు వాళ్ల విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించారో అర్థం చేసుకోవ‌చ్చు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై అభిమానంతో ఆయ‌న కుమారుడు జ‌గ‌న్‌ను సీఎంగా చూడాల‌నే ఆశ‌యంతో సోష‌ల్ మీడియాలో ప‌ని చేసిన వాళ్లంతా, ఇప్పుడు మ‌న‌కెందుకులే అని నిరాశ‌నిస్పృహ‌ల్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. వైసీపీపై అభిమానంతో ప‌ని చేసిన సోష‌ల్ మీడియా ఔత్సాహికులు, కేవలం జ‌గ‌న్‌, ప్ర‌భుత్వ పెద్ద‌ల ప‌ల‌క‌రింపును మాత్ర‌మే కోరుకున్నారు. అయితే జగన్ వైఖరి వైఎస్‌లా ఉండదని వారికి ఎక్కువ కాలం పట్టలేదు. దాంతో వైసీపీ సోషల్ మీడియా కాడె వదిలేసి, తమ పనులు తాము చూసుకోవడం మొదలెట్టారు. సోష‌ల్ మీడియా పరంగా ప్రస్తుతం టీడీపీ చాలా బ‌లంగా ఉంది. టీడీపీ సోషల్ మీడియా దూకుడుని వైసీపీ తట్టుకోలేక పోతుందంటున్నారు. ఆ క్రమంలో ఇప్ప‌టికి కూడా వైసీపీ సోష‌ల్ మీడియా బ‌ల‌హీనంగా ఉండ‌డానికి కార‌ణాలేంటో జ‌గ‌న్ తెలుసుకోలేక‌పోతున్నారు.

వైసీపీ సోష‌ల్ మీడియా ఎక్కువగా సెల్ష్ డిఫెన్స్‌కే పరిమితమవుతోంంటున్నారు. టీడీపీ పై వైసీపీ సోష‌ల్ మీడియా నుంచి ఎదురు దాడి క‌రువైందన్న అభిప్రాయం ఉంది. వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు, అభివృద్ధి ప‌నులు, త‌దిత‌ర పాజిటివ్ అంశాలకే ప‌రిమితమైంది. వాస్తవానికి ఆ పని చేయడానికి ప్రభుత్వ సమాచార శాఖ ఉంటుంది. మరి ఆ మాత్రం దానికి పార్టీకి ప్రత్యేకంగా సోషల్ మీడియా ఎందుకని వైసీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. త‌న‌కు విజ‌య‌సాయిరెడ్డి స‌న్నిహితుడు కాబ‌ట్టి ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా బాధ్య‌త‌ల్ని జ‌గ‌న్ అప్ప‌గించారు. త‌న‌కు గుర్రంపాటి దేవేంద‌ర్‌రెడ్డి ముఖ్యం కాబ‌ట్టి ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు విజ‌య సాయిరెడ్డి అప్ప‌గించారు. గుర్రంపాటి తన అనుయాయులకు ఆ భాధ్యతలు పంచారు. స్థూలంగా ఇదీ వైసీపీ షోషల్ మీడియా రూపం, స్పాంటేనియస్‌గా రియాక్ట్ అయి రిటార్టులు ఇచ్చే వారికి ఆ మీడియాలో బెర్తే కనిపించదు. అటువంటప్పుడు వ్యవస్థాగత మార్పులు చేయకుండా, కేవలం కొత్త ఇన్‌చార్జుని పెడితే ప్రయోజనం ఏంటన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది.

Exit mobile version