Visakhapatnam: విశాఖలోని రుషికొండ తవ్వకాల పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండ పై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనుమతికి మించి ఎంత మేర తవ్వకాలు చేపట్టారు. ఎంత మేర భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని తెలిపింది. సర్వే చేసి నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు విచారణను ధర్మాసనం డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
వైజాగ్ లోని పురాతన రుషికొండలో అక్రమంగా భారీ తవ్వకాలు సాగించరని ప్రతిపక్షాలు కోడైకూస్తున్న సమయంలో హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టేలా చేసింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్‌ను చంపడానికి భారీ స్కెచ్.. జనసైనికులకు నాదెండ్ల ఆదేశాలు