Site icon Prime9

Supreme Court: రూ. 250 కోట్లు చెల్లించాల్సిందే.. ఏపీకి సుప్రీం కోర్టు ఆదేశం

Rs. 250 crores to be paid... Supreme Court order to AP Government

Rs. 250 crores to be paid... Supreme Court order to AP Government

New Delhi: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు రూ. 250కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం నష్ట పరిహారం కింద చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు అనే విషయం కామన్ అయిపోయాయి.

పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం పై ఎన్టీటీ సంయుక్త కమిటి నష్ట పరిహారం కింద ఏపీ ప్రభుత్వానికి రూ. 250కోట్లు జరిమానా విధించింది. తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేడు విచారణ చేసిన ధర్మాసనం ఎన్జీటి పేర్కొన్న విధంగానే నష్ట పరిహారాన్ని వెంటనే జమ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పరిహారం పై విచారణను కొనసాగిస్తామని 2023 ఫిబ్రవరిలో చేపడతామని ధర్మాసనం పేర్కొనింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: క్రిమినల్ రాజకీయ నాయకులంటే నాకు అసహ్యం.. పవన్ కల్యాణ్

Exit mobile version