Site icon Prime9

Ram Gopal Varma : నందమూరి ఫ్యామిలిలో ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ఆర్జీవి

ram gopal varma shocking comments on cbn and nandamuri family

ram gopal varma shocking comments on cbn and nandamuri family

Ram Gopal Varma : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగువారు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా.. విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, పలువురు నాయకులు, లక్ష్మి పార్వతి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జీవీ చంద్రబాబు నాయుడుని, నందమూరి ఫ్యామిలీని తీవ్రంగా విమర్శించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ని మాత్రం ఆకాశానికి ఎత్తుతూ నందమూరి ఫ్యామిలిలో ఒక్క మగాడు అని పొగిడారు. ఇక ఇప్పుడు వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఆర్జీవీ మాట్లాడుతూ.. ‘నేను ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాలేదు. కానీ మీకు ఒక జోక్ చెప్పేందుకు వచ్చాను. ఆ జోక్ చాలా సీరియస్ జోక్. ఎవ్వరూ నవ్వలేనటువంటి ఆ జోక్ ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతోంది. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌కు కూడా నవ్వాలో, ఏడ్వాలో కూడా అర్థం కానటువంటి జోక్ అది. ఇంటి సభ్యుడు, అల్లుడు (CBN) అయ్యుండి అంత దారుణంగా టార్చర్ చేసి, ఏడిపించి ఏడిపించి చంపిన తర్వాత మళ్లీ ఆయనే దండ వేసి.. అసలు ఎన్టీఆర్ లాంటివాడు లేడని చెప్పడానికి మించిన జోక్ ఉండదనేది నా ఉద్దేశ్యం’ అని చంద్రబాబును ఉద్దేశ్యించి వాఖ్యానించారు.

Why is Chandrababu Naidu silent on Ram Gopal Varma when he is making fun on  him/his family very badly? - Quora

‘ఆ రోజున ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతి మూలాన మాయాలో పడిపోయారా? లేదా ఇంకేం చేశారనే విషయంపై పలువురు రకరకాలుగా చెప్పి ఉండవచ్చు. కానీ ఇక్కడ మనకు సీబీఐ ఇన్వెస్టిగేషన్ గానీ లేదా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు బాగా రీసెర్చ్ చేసి నిజం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఎలాంటి వాడనేది స్వయంగా ఎన్టీఆర్ గారే చెప్పారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ పాయింట్ అనేది లేదు. ఇప్పుడు ఎవ్వరు ఏం చెప్పినా రికార్డ్‌లో ఉంటుంది. సందర్భం వచ్చినపుడు బయటకొస్తూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు’ అన్నారు వర్మ.

అదే విధంగా ‘ఒకవేళ లక్ష్మీ పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారంటే ఆయనకు బుర్ర లేదనేది మీ ఉద్దేశ్యమా? సీఎం స్థాయి మనిషి.. ఆయనకు బుర్ర లేకుండా లక్ష్మీ పార్వతి లాంటి ఒక అర్హత లేని మహిళ మాయలో ఆయన పడ్డారంటే మీరు ఇంకా ఎందుకు పూజిస్తున్నారు? ఎందుకు దండలేస్తున్నారు? కనీసం మీరు గతంలో చెప్పినదానిపై నిలబడాలి కదా?’ అని ప్రశ్నించారు ఆర్జీవీ. ‘ఇక శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు? అనేది నాకు తెలియదు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్‌లో నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు తారక్. ఎందుకంటే అంతపెద్ద సూపర్‌స్టార్ కొడుకులు కానీ, వాళ్లెవరూ రాకుండా చేసి ఈయన ఒక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. దీనికి తను ఏ కారణం చెప్పినా, చెప్పకపోయినా.. నా ఫీలింగ్ మాత్రం తాత గారి మీదున్న విపరీతమైన గౌరవంతో వీళ్లతో కలిసి స్టేజ్ మీద కనిపించకూడదని తను రాలేదని నా నమ్మకం. కాబట్టి ఎన్టీఆర్ అభిమానిగా తారక్‌కు నేను హృదయపూర్వకంగా థాంక్స్ చెప్తున్నా’ అన్నాడు ఆర్జీవీ.

Exit mobile version
Skip to toolbar