Site icon Prime9

CM Jagan: సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపు.. భారీ భద్రత ఏర్పాటు

police-protection-at-cm-jagan-house due to tribal unions protest

police-protection-at-cm-jagan-house due to tribal unions protest

CM Jagan: వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గత కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దానితో జగన్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం నివాసం చుట్టూ అదనపు బలగాలను మోహరించారు. ఈ కులాలను ఎస్టీలలో చేరిస్తే తమకు రిజర్వేషన్లు తగ్గిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం ఇంటి ముట్టడికి వారు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గాల్లో మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ కట్ట, పాత టోల్ గేట్ కూడలి, తాడేపల్లి పశువైద్యశాల మార్గం, పాతూరు అడ్డరోడ్డు, క్రిస్టియన్ పేట కూడళ్లలో వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని వెంటనే అక్కడి నుంచి తరలించేస్తున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణలోని చారిత్రక కట్టడాలకు యునెస్కో అవార్డులు

Exit mobile version