ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సీఎం వైఎస్ జగన్ పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.55,587.87 కోట్లను ఆమోదించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రూ.పది వేల కోట్లను అడ్‌హక్‌గా ఇవ్వాలని కోరిన విషయం విధితమే. పోలవరానికి అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్ల నిధులను మంజూరు చేయడానికి అంగీకరించిన కేంద్ర కమిటీ. రాష్ట్ర జలవనరుల శాఖతో సమావేశమై నివేదిక తయారుచేయాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కె.వోహ్రా మంగళవారం నాడు వర్చువల్ విధానం ద్వారా పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, సహాయ పునరావాస విభాగం కమిషనర్ సీహెచ్ శ్రీధర్ తదితరులను కలిశారు.
రెండోదశలో…
పోలవరం రెండో దశ పూర్తైతే ఆయకట్టులో మిగిలిన 4.02 లక్షల ఎకరాలతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీరందుతుందని, ఇందుకు మరో రూ.21 వేల కోట్లకుపైగా నిధులు అవసరమవుతాయని సీఈ సుధాకర్‌బాబు కె.వోహ్రాకు తెలిపారు.