Site icon Prime9

Pawan Kalyan : సాక్షి టీవి రిపోర్టర్ కి అదిరిపోయేలా పంచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. మీ బాస్ లాగా కాదంటూ !

pawan kalyan shocking reply to sakshi tv reporter

pawan kalyan shocking reply to sakshi tv reporter

Pawan Kalyan : విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్‌పై పవన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ, జనసేననా? లేక బీజేపీతో కలిసి వెళ్లడమా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. విశాఖపై ప్రేమతో పాలకులు రాజధాని అని చెప్పడం లేదని, 2004 నుంచి కొన్న భూముల కోసమే విశాఖకు వస్తున్నారని విమర్శించారు. అభివృద్ది చేయడానికి రాయలసీమలో అవకాశం లేదని, ఉత్తరాంధ్ర వనరులను దోపిడీ చేస్తే అడిగేవారే లేరని ఆరోపించారు. అలానే సాక్షి ఛానల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌ అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారు. జగన్‌.. రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారి. యువతులు అదృశ్యమైతే సీఎం స్పందించలేదు. వైసీపీ పాలనతో చూస్తే తెదేపా పాలనే మంచిదనిపించింది అంటూ వ్యాఖ్యానించారు.

 

Exit mobile version