Site icon Prime9

Pawan Kalyan: విద్యుత్ షాక్ గురై, ముగ్గురు రైతుల దుర్మరణం బాధాకరం.. మరో ఉడతల కేసుగా చూడద్దొంటూ వినతి.. పవన్ కల్యాణ్

Pawan Kalyan said that the death of three farmers in the crop field due to electric shock is very sad

Andhra Pradesh: పంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు రైతుల దుర్మరణ ఘటన చాలా దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా చాపాడు మండలం, చియ్యపాడులో పొలంలో పిచికారి చేస్తూ రైతులు తెగిపడిన విద్యుత్ తీగలకు తగిలి ఓబుల్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, బాల ఓబుల్ రెడ్డిలు మృతి చెందారు.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పంట పొలంలో విద్యత్ వైర్లు తెగిపడడం ఆ శాఖ నిర్లక్ష్యంగా పేర్కొన్నారు. సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఉడతలు కొరికాయంటూ, అందువల్ల తీగలు తాయన్న కబుర్లు చెప్పద్దన్నారు. వ్యహారాన్ని మరుగున పడకుండా బాధిత రైతు కుటుంబాలకు ప్రభుత్వం తగిన సాయం చేయాలని, చట్టబద్దమైన నష్ట పరిహారాన్ని ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Vishnu Vardhan Reddy: కడప జిల్లావాసులకు జగన్ క్షమాపణ చెప్పాలి.. భాజపా నేత విష్ణువర్ధన రెడ్డి

Exit mobile version