Site icon Prime9

Pawan Kalyan : జనసేన – తెదేపా కలిసే పోటీ చేస్తాయి – పవన్ కళ్యాణ్.. ప్రెస్ మీట్ లైవ్

pawan kalyan press meet live from rajahmundry central jail

pawan kalyan press meet live from rajahmundry central jail

Pawan Kalyan : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయనను కలిసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ జైలు లోపలికి వెళ్ళడం జరిగింది. చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాల భేటీ తర్వాత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా మీకోసం ప్రత్యక్షప్రసారం..  

మధ్యాహ్నం 12 గంటలకు వీరు చంద్రబాబును కలవనున్నారు. సమావేశం సందర్భంగా చంద్రబాబుతో పవన్ కీలక విషయాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో లోకేష్ ముందుగానే రాజమండ్రిలో ఉండగా.. బాలయ్య ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నారు. ఇక మరి కొద్ది సమయం తర్వాత పవన్ కూడా రాజమండ్రి చేరుకొని ముగ్గురు కలిసి జైలు లోపలికి వెళ్లారు. జైలు వద్దకు జనసైనికులు, టీడీపీ అభిమానులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు.

ఇదివరకే తొలి దఫా ములాఖత్ లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలు కలిశారు. కాగా ఇప్పుడు పవన్, బాలకృష్ణ, లోకేష్ ముగ్గురు కలిసి చంద్రబాబుతో భేటీ కానుండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జైలు వద్దకు జనసైనికులు, టీడీపీ అభిమానులు ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. అలానే టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుసైతం చంద్రబాబుతో గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ కానున్నట్లు తెలిసింది.

Exit mobile version